భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కీలకమైన పోరు మొదలైంది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మధ్య లాహోర్ వేదికగా నేడు (ఫిబ్రవరి 28) గ్రూప్-బీ మ్యాచ్ జరుగుతోంది. ఆ రెండు జట్లకు గ్రూప్ దశలో ఇదే చివరి మ్యాచ్. ఈ పోరులో గెలిచిన జట్టు సెమీఫైనల్‍కు చేరుతుంది. ఈ అత్యంత కీలకమైన మ్యాచ్‍లో టాస్ గెలిచి.. ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది.

ఈ ముఖ్యమైన మ్యాచ్‍కు అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా తుదిజట్లలో మార్పులు చేయలేదు. గత మ్యాచ్‍లో ఆడిన టీమ్‍నే కొనసాగించాయి. విన్నింగ్ కాంబోనే కంటిన్యూ చేశాయి. ఈ మ్యాచ్ కోసం తాము ప్లాన్స్ చేసుకున్నామని టాస్ సమయంలో హష్మతుల్లా తెలిపాడు. గత మ్యాచ్ ఫామ్ కొనసాగిస్తామని నమ్ముతున్నామని చెప్పాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్‍లో దక్షిణాఫ్రికా చేతిలో అఫ్గానిస్థాన్ ఓడింది. అయితే...