Hyderabad, జనవరి 31 -- చలికాలం ఉన్నంతకాలం తాత్కాలిక, త్వరిత ఉపశమనం కావాలనుకునే ప్రతి వారికీ గుర్తొచ్చేది ఒకటే వేడిగా ఛాయ్. చాలా ప్రాంతాల్లో బజ్జీలుగా పిలిచే వీటిని మన దక్షిణాదిలో పకోడీలు అంటుంటాం. శతబ్దాలుగా భారతీయులు ఇష్టంగా తినే వంటల్లో పకోడీలు భాగమైపోయాయి. పండుగ రోజుల్లో, ప్రత్యేక సందర్భాల్లోనూ కచ్చితంగా తయారుచేసుకునే ఈ వంటకం ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా ప్రిపేర్ చేస్తుంటారు.

కరకరలాడుతూ ఉండే ఈ పకోడీలు రుచిగా అనిపించి ఇంకా తినాలని అనిపిస్తుంటాయి. ప్రత్యేకించి ఛాయ్ తో పాటు తింటే అంతకుమించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక పకోడీలు అంటే ఒకే రకంగా చేసుకోవాలనేం లేదు. ఇందులో బోలెడు రకాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి.

ఉల్లి పకోడీ (Onion Pakora): సన్నగా తరిగిన ఉల్లిపాయలతో తయారుచేసుకునే ఈ పకోడీ కరకరలాడుతూ ఉంటుంది. శనగపిండి, జీలకర్ర, ధనియాలు, పసుపు వంటి ...