భారతదేశం, మార్చి 21 -- ప్రముఖ భారత క్రికెటర్​ యుజ్వెందర్​ చాహల్​- ధనశ్రీ వర్మకు అధికారికంగా విడాకులు లభించాయి. అంతేకాదు భరణం కింద చాహల్​ నుంచి ధనశ్రీ రూ. 4.75 కోట్లు అందుకోనున్నారు. మరి ఈ అమౌంట్​పై ధనశ్రీ ఎంత పన్ను కట్టాలో మీకు తెలుసా? భరణం విషయంలో భారత దేశ చట్టాలు ఏం చెబుతున్నాయంటే..

విడాకులు లేదా విడిపోయిన తర్వాత గత జీవిత భాగస్వామి ఆర్థిక అవసరాలకు సాయం అందించడాన్నే భరణం అంటారు. దీన్ని ఇంగ్లీష్​లో ఆలిమోని అని పిలుస్తారు.

భారత దేశంలో భరణం చుట్టు అనేక చట్టాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్​ యాక్ట్​, స్పెషల్​ మ్యారేజ్​ యాక్ట్​, ఇండియన్​ డివోర్స్​ యాక్ట్​, ముస్లిం ఉమెన్​ యాక్ట్​, పార్సీ మ్యారేజ్​ అండ్​ డివోర్స్​ యాక్ట్​ వంటివి ఉదాహరణలు. గత జీవిత భాగస్వామికి భరణం ఇచ్చే ముందు కోర్టులు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. వివాహం సమయంలో జీవన శైలి, ఖర...