Hyderabad, ఫిబ్రవరి 14 -- నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో ప్రజలు గంటల తరబడి ఒకే చోట కూర్చుని కంప్యూటర్‌లో పనిచేస్తూ ఉంటారు. గంటల తరబడి తప్పుడు పొజిషన్‌లో కూర్చోవడం, మొబైల్, ల్యాప్‌టాప్‌లను అధికంగా ఉపయోగించడం వల్ల దీర్ఘకాలికంగా ఆరోగ్యంతో సంబంధించిన అనేక సమస్యలు వ్యక్తిని బాధించడం ప్రారంభిస్తాయి. ఈరకమైన జీవనశైలిని అనుసరిస్తున్న వారిలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నసమస్య వీటిలో ముఖ్యమైనది సెర్వికల్ స్పాండిలైటిస్.

సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడలోని కీళ్లు, డిస్క్‌లను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యతో బాధపడే వ్యక్తికి మెడ నొప్పి, భుజం నొప్పి, తలనొప్పి, మెడ వెనుక భాగంలో నొప్పి, భుజం బ్లేడ్ చుట్టూ నొప్పి, చేతుల్లో తిమ్మిరి వంటి అనేక రకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక నరకం లాంటిదే. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఈ 3 వ్యా...