భారతదేశం, ఫిబ్రవరి 20 -- తెలుగు హీరోలకు చెందిన రెస్టారెంట్లు హైదరాబాద్ లో ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మందికి అవి స్టార్ హీరోల రెస్టారెంట్లు అని మాత్రం తెలియవు. ఇవి ప్రత్యేక వాతావరణంలో ఎంతో క్లాసీగా ఉంటాయి. నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది హైదరాబాద్ లో రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ జాబితాను ఇక్కడ ఇచ్చాము. ఎప్పుడైనా వెళ్లేందుకు ప్రయత్నించండి.

ఫిల్మ్ నగర్‌లో ఉన్న విలాసవంతమైన రెస్టారెంట్ ఇది. ఎప్పుడూ జనాలతో నిండి ఉంటుంది. ఈ రెస్టారెంట్ అద్భుతమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అనేక రకాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శాంక్చువరీ - బార్ & కిచెన్ పెట్టిన బిల్డింగ్. రానా కుటుంబానికి చెందిన ఇల్లు. పాత ఇంటిని రెనోవేషన్ చేయించి రెస్టారెంట్ గా మార్చారు. ప్రైవేట్ డైనింగ్ గదులు, ప్రైవేట్ బార్ ఏర్పాటు ఎక్కడ ఉంది....