భారతదేశం, ఏప్రిల్ 23 -- UPSC CDS II Final Result 2023: యూపీఎస్సీ సీడీఎస్-2 2023 ఫైనల్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2) 2023కు హాజరైన అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.

ఇండియన్ మిలిటరీ అకాడమీ 157 (DE) కోర్సులో ప్రవేశం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 సెప్టెంబరులో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2)ను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఆ ఇంటర్వ్యూల అనంతరం తుది ఫలితాలను నేడు ప్రకటించారు. చివరగా, ఇండియన్ మిలిటరీ అకాడమీ 157 (DE) కోర్సులో ప్రవేశం కోసం మొత్తం 197 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి డెహ్రాడూన్ లోని ఇండియన్ మిల...