Hyderabad, మార్చి 28 -- ఇటీవల ఓ వ్యాపారవేత్త ముంబైలో కూర్చొని తన ఉత్తరప్రదేశ్ ఇంట్లో దొంగతనాన్ని సకాలంలో ఆపగలిగాడు. తన ఇంట్లో పెట్టిన సీసీ కెమెరాల సాయంతో ఫోన్లోనే ఇంటి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. అలా ఆయన సీసీ కెమెరాలో ఇంటి దగ్గరకు దొంగలు రావడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలా ఆ వ్యక్తి ఇంట్లో ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తపడ్డడాు. సీసీటీవీ ఇంతగా ఉపయోగపడటం ఇదే తొలిసారి కాదు. ఈ రోజుల్లో చాలా మంది తమ కార్యాలయాలు, దుకాణాలు, ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టి తమ ఫోన్లకు కనెక్ట్ చేసుకుంటున్నారు.

ఈ సీసీ కెమెరాల సాయంతో ఇంటికి దూరంగా కూర్చొని ఇంటి దగ్గర ప్రదేశంలోని ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. కానీ మీ అవసరాన్ని బట్టి సరైన సిసి కెమెరాలను కొనుగోలు చేయాలి. ఎంతోమందికి సీసీ కెమెరాలను పెట్టాలనుకున్నా కూడా అవి ఎలా పనిచేస్తాయో తెలియదు. సీస...