Hyderabad, ఫిబ్రవరి 3 -- CCL 2025 Telugu Warriors Schedule And Live Streaming OTT Platform: మన అభిమానల హీరోలు సినిమాల్లో ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ కొడితే థియేటర్లలో విజిల్స్ వేస్తూ, క్లాప్స్ కొడుతూ విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటాం. అదే మన స్టార్ హీరోలు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లో సిక్సర్ల మోత మోగిస్తే.. ఫోర్లతో బౌండరీలు దాటిస్తే.. బౌలింగ్‌తో వికెట్లు పడగొడితే.. అంతకుమించిన ఆనందం కలుగుతుంది.

హీరోలు బ్యాట్ పట్టుకునే చెలరేగే టోర్నమెంట్‌కు సమయం ఆసన్నమైంది. ఈ సంవత్సరం కూడా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అలరించనుంది. దీనికి సంబంధించి సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్ ఆదివారం (ఫిబ్రవరి 2) జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, హీరో సచిన్ జోషి, అశ్విన్ బాబు, ఆది సాయికుమార్, సామ్ర...