Hyderabad, ఫిబ్రవరి 3 -- Akhil Akkineni About CCL Title For 5Th Time: సీసీఎల్ 11వ సీజన్, తెలుగు వారియర్స్ థ్రిల్లింగ్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. సెలబ్రీటీ క్రికెట్ లీగ్ (CCL) ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌ను ప్రారంభం కానుంది. ఇది మైదానంలో మరపురాని క్షణాలను అందిస్తోంది.

ఈ సీజన్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌లుగా తమ లెగసీని కంటిన్యూ చేయడానికి వారి ప్రతిష్టాత్మకమైన 5వ టైటిల్ గెలుపు కోసం సిద్ధమవుతున్న బలమైన జట్టు తెలుగు వారియర్స్‌పై అందరి దృష్టి ఉంది. ఈ సందర్భంగా తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ ప్రెస్ మీట్ ఫిబ్రవరి 2న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో అక్కినేని అఖిల్, ఎస్ఎస్ తమన్, సచిన్ జోషి, హీరో అశ్విన్ బాబు, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సిసిఎల్ 14 ఏళ్ల జర్నీ. గ్లిం...