భారతదేశం, ఏప్రిల్ 10 -- బోర్డు ఫలితాలకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సీబీఎస్ఈ కీలక నోటీసు జారీ చేసింది. అన్ని పాఠశాలలకు ఒక ముఖ్యమైన నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులో పాఠశాలలు తమ విద్యార్థుల పేర్లు, తరగతి, తల్లిదండ్రుల పేర్లు, ఇతర ముఖ్యమైన వివరాలలో దిద్దుబాట్లు చేసుకోవచ్చని పేర్కొంది. తద్వారా విద్యార్థులు సరైన ఫలితం, మార్కుల షీట్ పొందవచ్చని తెలిపింది. ఎందుకంటే సరైన వివరాలు లేకుంటే మార్కుల షీట్‌లో అవే వస్తాయి. దీంతో విద్యార్థుల తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

కరెక్షన్ విండోను సీబీఎస్ఈ ఏప్రిల్ 9, 2025న తెరిచింది. ఇది ఏప్రిల్ 17, 2025 వరకు తెరిచి ఉంటుంది. దీని తరువాత, దిద్దుబాటు కోసం ఎటువంటి అభ్యర్థనను అంగీకరించబోమని బోర్డు కఠినమైన సూచనలు ఇచ్చింది.

వాస్తవానికి బోర్డు పదే పదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ అనేక పాఠశాలలు విద...