భారతదేశం, ఫిబ్రవరి 16 -- మహిళల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నివారణకు డేగకన్నుతో పని చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా సరే.. ఆడబిడ్డల జోలికొస్తే వదిలిపట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'ఏపీని స్వచ్చాంధ్ర చేయాలని సంకల్పించాం. స్వచ్ఛమైన ఆలోచనలతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలంతా నెలలో ఒక్కరోజైనా సమయం కేటాయించాలి. ప్రజాహితం, భావితరాల భవిష్యత్తు కోసమే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ప్రతి ఇల్లు కూడా పరిశుభ్రంగా తయారై రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి' అని చంద్రబాబు పిలుపునిచ్చా...