భారతదేశం, జనవరి 29 -- CBN Supreme Court: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీహైకోర్టు నవంబర్ 24న మంజూరు చేసిన ఉత్తర్వులను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టేసింది.విచారణకు చంద్రబాబు సహకరించపోతే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ సిఐడి అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 12న ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నిందితుడిగా చేర్చారు. చంద్రబాబుపై దాఖలైన పలు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

నవంబర్ 24వ తేదీన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ( Inner ring road ), టీడీపీ హయంలో ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పాక్షిక హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్...