భారతదేశం, ఫిబ్రవరి 12 -- CBN On Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో త్వ‌ర‌లోనే డీఎస్సీ నిర్వ‌హిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. త్వ‌ర‌లోనే డీఎస్సీ నిర్వ‌హించి ఉద్యోగ నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు రావాల్సిన నిధులు ఎంత‌మేర రాబ‌ట్ట‌గ‌లుగుతామో ఆ మేరకు రాబ‌ట్టేలా ప‌ని చేయాల‌ని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిస్థాయిలో గాడిలో ప‌డాలంటే మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వం వ‌ల్ల ఏర్ప‌డ్డ న‌ష్టాలు వెంటాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, బాధ‌లున్న‌ప్ప‌టికీ కూడా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఈ ఎనిమిది నెల‌ల్లోనే రూ.22,507 కోట్ల పాత బ‌కాయిల‌ను చెల్లించ‌ గ‌లిగింద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఇది ఈ ప్ర‌భుత్వ నిబద్ద‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

రాష్ట్రంలో చాలా క్లిష...