భారతదేశం, ఫిబ్రవరి 11 -- CBN on IAS: ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్‌కు ఆర్నెల్ల నుంచి ఏడాది సమయం పట్టడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు పట్టారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కొన్ని శాఖల్లో మితిమీరిన జాప్యాన్ని సీఎఉం తప్పు పట్టారు. ఇటీవల శాఖల వారీగా ఫైల్స్‌ క్లియర్ చేస్తున్న తీరు తన దృష్టికి రావడంతో విడుదల చేసినట్టు చెప్పారు.

కొంతమంది అధికారులు ఫైళ్ల క్లియరెన్స్‌చేయడానికి అధిక సమయం తీసుకుంటున్నారని, కొందరు వ్యక్తులు, సెక్రటరీలు ఆర్నెల్ల నుంచి ఏడాది సమయం తీసుకుంటున్నారని సీఎం అన్నారు. అంత సమయం తీసుకోడానికి కారణం ఏమిటి, ఎవరు ఎందుకు క్లియర్‌ చేయడం లేదో అధికారులకు స్పష్టత ఉంటుందన్నారు.

అన్ని శాఖల్లో అందరు కార్యదర్శులు స్పష్టంగా నిర్ణయాలు తీసుకోవాలని వేగంగా నిర్ణయం తీసుకోవాలని, ఫైల్స్‌ త్వరగా క్లియర్ చేయాలన్నార...