భారతదేశం, ఫిబ్రవరి 8 -- దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన గెలుపు ఇది అని అభివర్ణించారు. దేశ, రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలని చెప్పారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయన్నారు.

'సుస్థిర అభివృద్ధి విధానాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. అందుకే బీజేపీని ప్రజలు ఆదరించారు. అభివృద్ధి ఉంటేనే సంపద సృష్టి జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ పాలిటిక్స్ ఉండాలి. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు మొదలు పెట్టి 34 ఏళ్లు అయ్యింది. 1991కి ముందు వెనకా చూస్తే.. స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. సంస్కరణల తరవాతే అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి' అని చంద్రబాబు వివరించారు.

'ఇన్నేళ్లలో గుజరాత్ తలసరి ఆదాయం ...