భారతదేశం, మార్చి 30 -- పేదరికం లేని సమాజమే తన జీవితాశయమని.. అందులో భాగంగానే పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో చంద్రబాబు పాల్గొన్నారు. టీటీడీ పంచాంగం సహా వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ పంచాంగాలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి మాట్లాడ...