భారతదేశం, ఫిబ్రవరి 3 -- CBN In Delhi: ఏపీలో జగన్ రుషికొండ ప్యాలెస్‌ కడితే ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మాణం చేపట్టారని, ప్యాలెస్‌లోకి అడుగుపెట్టక ముందే జగన్‌ను ఏపీలో చిత్తుగా ఓడించారని... ఇక్కడా అదే జరగాలని, ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారు ఏకపక్షంగా బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బిజెపి అభ్యర్థి సంజయ్ గోయల్‌కు ఓటేయాలని ఓటర్లకు సూచించారు.

పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయిందని దేశం మొత్తం స్వ...