భారతదేశం, ఫిబ్రవరి 1 -- CBI Case On KLEF University : NAAC A++ రేటింగ్ కోసం లంచం ఇచ్చారన్న ఆరోపణలపై గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసింది.

తమ విద్యాసంస్థకు అనుకూలమైన రేటింగ్ ఇచ్చేందుకు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ నిర్వాహకులు NAAC టీమ్ సభ్యులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ...కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీలో సోదాలు నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసింది. ఈ విద్యాసంస్థ నిర్వాహకులు... NAAC టీమ్ సభ్యులకు నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసులో సీబీఐ చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, ...