Hyderabad, మార్చి 21 -- అందం అంటే అసలైన అర్థం చిరునవ్వు. చూడగానే మనిషిని ఆకర్షించేది కూడా నవ్వే. అలాంటి నవ్వును చెదరగొడతాయి పసుపు పచ్చ దంతాలు. అందమైన తెల్లని దంతాలు మీ నవ్వును మెరుపరుస్తాయి. అందరిలోనూ ఆత్మవిశ్వాసంతో నిలబడేలా చేస్తాయి. అంతేకాదు.. తెల్లని దంతాలు మంచి ఆరోగ్యానికి సంకేతంగా కూడా చెబుతారు. కానీ చాలా మంది పళ్లు పసుపు పచ్చ రంగులోకి మారి ఇబ్బంది పెడుతున్నాయి. వీటి కారణంగా మనస్పూర్తిగా నవ్వలేకపోతున్నార వారు ఎందరో ఉన్నారు. మీరూ అలాంటి వారే అయితే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.

దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం ప్రతి సారి జన్యుపరమైనది మాతమ్రే కాకపోవచ్చు. దంతవైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పళ్లు పసుపు రంగులోకి మారడానికి కారణంగా ఎక్కువ శాతం వ్యక్తులకున్న రోజూవారీ చెడు అలవాట్లేనట. మీకు తెలియకుండానే మీరు చేసే చిన్న చిన...