Hyderabad, ఏప్రిల్ 3 -- Catherine Tresa About Snakes In Phani Movie Launch: తెలుగులో చమ్మక్ చల్లో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కేథరీన్ ట్రెసా. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, పైసా, సరైనోడు, గౌతమ్ నందా, నేనే రాజు నేనే మంత్రి, బింబిసార వంటి అనేక సినిమాల్లో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసింది.

తాజాగా కేథరీన్ ట్రెసా హీరోయిన్‌గా నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఫణి. టాలీవుడ్ సీనియర్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ గ్లోబల్ మూవీ ఫణిలో మహేశ్ శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఫణి మోషన్ పోస్టర్ లాంచ్ రీసెంట్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా ఆశ్చర్యకర విషయాలు చెప్పింది.

హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ.. "ఫణి సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన డైరెక...