భారతదేశం, నవంబర్ 19 -- ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ (ఐఐఎం-కే) ఆధ్వర్యంలో క్యాట్ 2025 పరీక్ష.. నవంబర్ 30, 2025న జరగనుంది. సుమారు 2.95 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారని అంచనా. దేశవ్యాప్తంగా దాదాపు 170 నగరాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల్లో ఈ క్యాట్ పరీక్ష మూడు సెషన్లలో జరుగుతుంది.

కామన్ అడ్మిషన్ టెస్ట్ రాయడానికి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం, వోక్సెన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ మేనేజర్ అయిన నిపుణురాలు కీర్తన వర్మ.. సెక్షన్ల వారీగా అనుసరించాల్సిన ముఖ్యమైన టిప్స్​, స్కోరింగ్ వ్యూహాలను పంచుకున్నారు. ఇవి క్యాట్​ 2025 అభ్యర్థులకు కచ్చితంగా ఉపయోగపడతాయి.

1. సరైన ప్రిపరేషన్ మైండ్‌సెట్

క్యాట్ పరీక్షకు సిద్ధమవ్వడానికి సరైన మానసిక స్థితిని పొందేందుకు నాకు దాదాపు మూడు నెలలు పట్టింది. క్యాట్‌ను తప్పక పూర్తి చేయా...