భారతదేశం, మార్చి 16 -- Case Filed On Harsha Sai : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కారణంగా యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు అయింది. సైబరాబాద్ పోలీసులు... హర్షసాయిపై కేసు నమోదు చేశారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాను ప్రమోట్ చేయకపోతే వేరేవాళ్లు చేస్తారని, ఎందుకు ఆ డబ్బు పోగొట్టుకోవడం...ఆ డబ్బును పేద ప్రజలకు పంచుతున్నానని హర్షసాయి ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. హర్షసాయిపై మండిపడ్డారు.

బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్... యువత బెట్టింగ్‌ల బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమని, ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తు్న్న సోషల్ మీడియ...