భారతదేశం, సెప్టెంబర్ 7 -- జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో దేశంలోని ఆటోమొబైల్​ సంస్థలు తమ పోర్ట్​ఫోలియోలోని వాహనాల ధరలను తగ్గిస్తున్నాయి. ఈ జాబితాలోకి టయోటా, మహీంద్రా వంటి దిగ్గజ సంస్థలు తాజాగా చేరాయి. ఫలితంగా పలు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​పై భారీ ప్రైజ్​ కట్​ కనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టయోటా కిర్లోస్కర్ మోటార్ తన కార్ల ధరలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ తగ్గింపుతో టయోటా మోడళ్లు గరిష్ఠంగా రూ. 3.49 లక్షల వరకు చౌకగా లభించనున్నాయి. ఇందులో టయోటా ఫార్చ్యూనర్‌కు అత్యధిక లబ్ధి చేకూరింది!

కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం.. టయోటా గ్లాంజా ధర రూ. 85,300 వరకు, టయోటా టైసార్ ధర రూ. 1.11 లక్షల వరకు తగ్గింది. టయోటా రూమియన్ ధరపై ...