Hyderabad, జనవరి 30 -- తెలుగిళ్లలో గారెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పండగ వస్తే గారెలు ఉండాల్సిందే. అల్పాహారంలో కూడా గారెలు తినేవారి సంఖ్య ఎక్కువే. ఇప్పుడు ఒకేలాంటి గారెలు కాకుండా కాస్త కొత్తగా పిల్లల కోసం టేస్టీగా క్యారెట్ గారెలు వండి చూడండి. ఇవి మీకు కచ్చితంగా నచ్చుతాయి. పైగా ఇవి ఎంతో ఆరోగ్యకరం కూడా. సాధారణ గారెలతో పోలిస్తే క్యారెట్ గారెలు తినడం వల్ల ఎక్కువ పోషకాలు సరైనవి చేరుతాయి. ఇక్కడ మేము క్యారెట్ గారెల రెసిపీని ఇచ్చాము. దీనికోసం ముందుగానే పిండి రుబ్బి పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

క్యారెట్ తురుము - ఒక కప్పు

బొంబే రవ్వ - ఒక కప్పు

పెరుగు - ఒక కప్పు

ఉల్లిపాయ తురుము - పావు కప్పు

పచ్చిమిర్చి తురుము - రెండు స్పూన్లు

అల్లం తురుము - ఒక స్పూను

కొత్తిమీర తురుము - ఒక స్పూను

పుదీనా తురుము - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

మైదా - రెండు స్పూ...