Hyderabad, ఏప్రిల్ 2 -- ఒకప్పుడు క్యాన్సర్ వృద్ధుల్లో కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా వస్తోంది. ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్ ఎక్కువగా యువకుల్లోనే పెరుగుతోంది. ఈ ధోరణి ఆందోళనకరంగా మారింది. అయితే యువతలో క్యాన్సర్ పెరగడానికి వారికున్న చెడు అలవాట్లే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారికున్న అలవాట్లను వదిలేస్తే కానీ క్యాన్సర్ నుంచి కాపాడుకోలేరని చెబుతున్నారు.

అధ్యయనాలు చెబుతున్న ప్రకారం యువతలో క్యాన్సర్ కేసులు పెరగడానికి అతిపెద్ద కారణం... వారు పాటిస్తున్న అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తినకపోవడం, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, శరీరంలో విషాలు, వ్యర్ధాలు పెరిగిపోవడం, ఇన్ఫ్లమేషన్ పెరగడం, ఆక్సీకరణ ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత... ఇవన్నీ చివరకు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. కాబట్టి య...