Hyderabad, మే 2 -- మనదేశంలో 2022లో 14 లక్షల మందికి కొత్తగా క్యాన్సర్ సోకినట్టు తేలింది. అంటే ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని అర్థం. అధిక మరణ రేటుతో కూడిన వ్యాధి క్యాన్సర్. కాబట్టి దీని బారిన పడకుండా ముందుగానే జాగ్రత్తలు పడాలి. క్యాన్సర్ కారకాలు అనగానే ధూమపానం, ఆల్కహాల్ వంటివే గుర్తొస్తాయి. నిజానికి మనం తినే ఉత్పత్తుల్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్ కారకాలు కలుస్తున్నాయి. అనేక రకాల మసాలాలు, కాస్మెటిక్స్ వంటివి నేరుగా మార్కెట్ లోనే కొంటాము. ఆ మసాలా ప్యాకెట్లపై అందులో ఏమి వాడారో ముద్రించి ఉంటుంది. వాటిని చూసి కొన్ని రకాల పదార్థాలు వాడితే కొనక పోవడమే మంచిది. క్యాన్సర్ కారకాలైన రసాయనాలు కూడా కొన్ని రకాల మసాలాలు, కాస్మెటిక్స్ లో వాడుతున్నారు. ఏ పదార్థాలు క్యాన్సర్ కారకాలో ముందుగా తెలుసుకుంటే మంచిది. ప్యాకెట్లపై ఉన్న Ingrediants న...