Hyderabad, ఏప్రిల్ 5 -- క్యాన్సర్ కు కారణమయ్యే వస్తువులు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. అలాంటి వాటిని వెంటనే బయటపడేయాలి. ధూమపానం, పాన్ మసాలా తినడం లేదా అనారోగ్యకరమైన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని అందరికీ తెలుసు.

కేవలం చెడు అలవాట్ల వల్లే కాదు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయని చాలా తక్కువ మందికే తెలుసు. అవగాహన లేకపోవడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమైపోతోంది. ఇంట్లో ఉండే ఏయే వస్తువులు ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయో తెలుసుకుందాం. వాటిని వెంటనే బయట పడేయడం ఉత్తమం.

ఈ రోజుల్లో , చాలా ఇళ్లలో వంట చేయడానికి నాన్ స్టిక్ కుక్ వేర్ ఉపయోగిస్తున్నారు. దీనిలో వంట చేయడం కొంచెం సులభం కాబట్టి చాలా మంది అందులో వంట చేయడానికి ఇష్టపడతారు. కానీ అధ్యయన...