Hyderabad, జనవరి 3 -- ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణాల్లో ఊబకాయం కూడా ఒకటి. అధికబరువుతో బాధపడుతున్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఊబకాయం బారిన పడతారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 38 శాతం మంది ఊబకాయం బారిన పడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే 12 ఏళ్లలో ఈ సంఖ్య 51 శాతానికి చేరుకుంటుంది. భారతదేశంలో కూడా స్థూలకాయుల సంఖ్య ప్రతి సంవత్సరం 5.2 శాతం చొప్పున పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు వేగంగా వేగంగా ఊబకాయం బారిన పడుతున్నారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.

ఊబకాయం వల్ల మహిళల్లో ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం 40 శాతం పెరుగుతుంది. ఊబకాయంతో ఉన్న మహిళలు గర్భం ధరిస్తే వారికి పుట్టే పిల్లలు స...