Hyderabad, ఫిబ్రవరి 4 -- బిర్యానీలు, కర్రీలు ఆర్డర్ పెడితే చాలు నల్ల బాక్సుల్లో అవి ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఇలాంటి నల్ల బాక్సులు వాడడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కంటైనర్లను వాడడం వల్ల విషపూరిత రసాయనాలు ఆహారంలోకి లీక్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నల్ల బాక్సుల్లో వేడి వేడి ఆహారాలు వేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నారు.

ఇలాంటి నల్లని కంటైనర్లు, బాక్సులు, ట్రేలు, ప్లాస్టిక్ గిన్నెలు వంటివి... పాత ఎలక్ట్రానిక్స్ వస్తువులను రీసైకిల్ చేయడం ద్వారా తయారవుతాయి. దీనిలో విపరీతమైన రసాయనాలు ఉంటాయి. ఇవి మంట, నిరోధకతను కలిగి ఉంటాయి. కాబట్టి ఆహారంలోకి అవి కలిసిపోయే అవకాశం ఉంది. అంటే ఈ బాక్సుల్లో వేడి వేడి పదార్థాలు వేసినప్పుడు ఆ రసాయనాలు ఆహారాల్లో చేరిపోతాయి.

సైంటిఫిక్ జర్నీ కెమ...