Hyderabad, మార్చి 14 -- మనకు చాలా రోజులుగా తెలిసిన మాటేంటంటే పౌష్టికాహారంలో పాలు చాలా ముఖ్యమైనవి. పాలు తాగితే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. శారీరకంగా బలంగా తయారవుతారు. అందుకే చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారైనా గ్లాసుడు పాలు తాగడం అలవాటుగా చేసుకోవాలని నిపుణు చెబుతుంటారు. ఎందుకంటే పాలలోని కాల్షియం ఎముక సాంద్రతను పెంచడంతో, వ్యక్తి బలహీనపడకుండా ఉండటానికి సహాయపడుతుంది.

కానీ కొందరిలో పాలు తాగాలన్నా, పాలతో తయారుచేసే పదార్థాలను తినాలన్నా అయిష్టత కనిపిస్తుంటుంది. ఇంకొందరికి వీటిని తీసుకోవడం వల్ల ఎలర్జీ కడుపులో అజీర్తి వంటి సమస్యలు వస్తుంటాయి. ఇటువంటి వాళ్లు అందరూ కాల్షియం కోసం ఏం తినాలా? అని ఆలోచిస్తుంటారు. మీరు అలాంటి వారే అయితే కాల్షియం కోసం మీరు కూవలం పాల మీదే ఆధారపడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్...