భారతదేశం, అక్టోబర్ 27 -- కేక్ ఇంట్లో చేయాలంటే చాలా పెద్ద పని అనిపిస్తుంది. ఓవెన్ ఉండాలి, లేదా ప్రెజర్ కుక్కర్లో ఉప్పు వేసి మీద బేక్ చేసే పద్ధతి కూడా కాస్త కష్టమే. కేక్ ఒక్కోసారి సరిగ్గా కుదరదు. కానీ బ్యాచిలర్లు కూడా సింపుల్‌గా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కేక్ చేసుకోవచ్చు. మీకు వంటల్లో నైపుణ్యం ఉంటే మరింత ఈజీగా అయిపోతుంది. దానికోసం కావాల్సిన పదార్థాలు, కొన్ని చిట్కాలతో సహా తెల్సుకోండి. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో బనానా కేక్ ఎలా చేయాలో చూద్దాం.

2 బాగా పండిన అరటిపండ్లు

4 గుడ్లు

సగం కప్పు పంచదార

100 గ్రాముల అన్ సాల్టెడ్ బటర్ (కరిగించుకోవాలి)

1 టీస్పూన్ వెనీలా ఎసెన్స్

1 కప్పు మైదా

1 టీస్పూన్ బేకింగ్ పౌడర్

పావు టీస్పూన్ ఉప్పు

1. ముందుగా మిక్సీ లేదా ఫుడ్ ప్రాసెసర్లో వేసి అరటిపండ్లు వేసి మెత్తగా చేసుకోవాలి.

2. మీరు వాడే రైస్ కుక్కర్ ...