Hyderabad, ఫిబ్రవరి 15 -- Cabbage Idli: వారంలో నాలుగు రోజులు ఇడ్లీనే అల్పాహారంగా తినే వారి సంఖ్య ఎక్కువే. ఇడ్లీ అన్ని రకాలుగా ఆరోగ్యకరమైనది. అందుకే ఎక్కువగా ఇడ్లీని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఒకే రకమైన ఇడ్లీ తింటే బోర్‌గా అనిపిస్తుంది. ఒకసారి కొత్తగా క్యాబేజీ ఇడ్లిని ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్యాబేజీ ఉండడం వల్ల మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ క్యాబేజీ ఇడ్లీ చేయడం కూడా చాలా సులువు.

ఇడ్లీ పిండి - ఒక కప్పు

క్యాబేజీ తురుము - అరకప్పు

జీలకర్ర - అర స్పూను

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

పసుపు - చిటికెడు

అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను

శనగపప్పు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

1. క్యాబేజీని సన్నగా తరిగి పక్కన పెట్టండి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయండి.

3. ఆ నూనె వేడెక్...