Hyderabad, మార్చి 25 -- ఏ బిజినెస్ చేయడానికి అయినా వేలల్లో లేదా లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. కానీ ఒక మహిళ కేవలం 50 రూపాయల పెట్టుబడితో బిజినెస్‌ను మొదలుపెట్టింది. ఆ బిజినెస్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. లండన్‌లో కూడా ఈమె తయారు చేసిన వెదురు రాఖీలను వాడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఆమె బాగా చదువుకున్న ఆధునిక మహిళ కాదు. ఒక సాధారణ స్త్రీ తన తెలివితేటలతో, కృషితో సొంతంగా బిజినెస్‌ను మొదలుపెట్టి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

మహారాష్ట్రలో మీనాక్షి వాల్కేను 'బాంబూ విమెన్' అని పిలుస్తారు. ఈమె తయారు చేసిన వెదురు రాఖీలే ఈమెకు వెదురు మహిళగా పేరును తెచ్చిపెట్టాయి.

మీనాక్షికి 2014లో వివాహం జరిగింది. రెండేళ్ల పాటు ఆమె ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉండేది. ఒక కొడుకు పుట్టాక భర్త తెచ్చిన జీతం సరిపోయేది కాదు. దీంతో ఆమె కూడా పనిచేయాలని అనుకుంద...