భారతదేశం, ఫిబ్రవరి 24 -- Bus Accident: తిరుపతి జిల్లా సుళ్లూరు పేటలో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడటంతో 17మంది గాయపడ్డారు. పాండిచ్చేరి నుంచి విజయవాడ వస్తున్న మార్నింగ్ స్టార్‌ ట్రావెల్స్‌ బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బయల్దేరినప్పటి నుంచి డ్రైవర్‌ వాహనాన్ని ర్యాష్‌‌గా నడుపుతూ వచ్చాడని, బస్సులో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని వారించినా డ్రైవర్‌ లెక్క చేయలేదని ప్రయాణికులు ఆరోపించారు.

మితిమీరిన వేగంతో ప్రయాణించిన ట్రావెల్స్‌ బస్సు తిరుపతి జిల్లా సుళ్లూరుపేట శివార్లలో అాదుపు తప్ప బోల్తా పడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాందోల దాదాపు 17మంది ప్రయాణికులు గాయపడ్డారు.వారిని సుళ్లూరుపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికితస అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published by HT Digital...