Hyderabad, మార్చి 4 -- Bunny Vasu About Chhaava Telugu Release: ఛత్రపతి శంభాజీ మహారాజ్ అజేయమైన స్ఫూర్తిని, ధైర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే చారిత్రక ఇతిహాసం ఛావా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.

హిందీ వెర్షన్ భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తర్వాత ఈ పవర్ ఫుల్ కథ ఛావాను తెలుగులోకి డబ్ చేసి మార్చి 7న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఛావా తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగం గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఛావా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఛావా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప...