భారతదేశం, మే 23 -- Bullet Sounds: ఎంతో ఇష్టంగా బైకులు కొనే కొంత మంది యువకులు, స్టూడెంట్స్ దాని ‌ఇంజన్‌ శబ్దం మారేందుకు సైలెన్సర్లు మార్చేస్తుంటారు. ముఖ్యంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ లాంటి బండ్లు పెద్ద శబ్ధం వచ్చేలా సైలెన్సర్లు మార్చడంతో పాటు డ్రైవింగ్ లో షాట్స్ కూడా ఇస్తుంటారు.

ఇక మీదట వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇష్టమొచ్చినట్లుగా సైలెన్సర్లుగా మార్చేస్తామంటే కుదరదు! డుగ్.. డుగ్.. మంటూ పెద్ద ఎత్తున శబ్ధం వచ్చేలా సైలెన్సర్లు మార్చడం, సౌండ్ తో జనాలకు ఇబ్బందులు కలిగిస్తే సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు వరంగల్ పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ మేరకు సైలెన్సర్లు మారిస్తే బండి ఓనర్ తో పాటు మార్చిన మెకానిక్ పైనా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.

మూడు నెలల పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల వరంగల్ ట్రై సిటీలో స్పెష...