Hyderabad, ఏప్రిల్ 29 -- Prabhas Gopichand Ravi Varma: శ్రీ బండి సదానంద్ అండ్ మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికృష్ణ సమర్పణలో తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం బుల్లెట్. ఎవ్వడికైనా దిగుద్ది అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు దర్శకుడు చౌడప్ప డైరెక్షన్ చేశారు.

ఈ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు రవి వర్మ. బుల్లెట్ సినిమాలో రవి వర్మకు జోడీగా హీరోయిన్ సంజనా సింగ్ నటించింది. ఈ ఇద్దరితోపాటు ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, షఫీ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా ఇంకా థియేటర్లలో కొనసాగుతుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం (ఏప్రిల్ 26) సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బుల్లెట్ 50 రోజుల వేడుకను నిర్వహి...