భారతదేశం, ఫిబ్రవరి 11 -- తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారం (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో మొదటి నుంచి మంచి వసూళ్లను రాబడుతోంది. మెలోడియస్ 'బుజ్జితల్లి' పాట రిలీజ్‍కు ముందే ఈ మూవీకి మంచి బజ్ తీసుకొచ్చింది. చాలా పాపులర్ అయింది. అయితే, తండేల్ సినిమాలో బుజ్జితల్లి పాటకు సాడ్ వెర్షన్ కూడా ఉంది. ఇది ఎమోషనల్‍గా మనసులను తాకేలా ఉంటుంది.

తండేల్ చిత్రంలో సత్య అలియాజ్ బుజ్జితల్లి (సాయిపల్లవి) కోపంతో ఓ దశలో రాజు (నాగచైతన్య)తో మాట్లాడదు. చేపల వేటకు వెళ్లిన రాజు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. తన మాట వినకుండా చేపల వేటకు గుజరాత్‍కు వెళ్లి రాజుపై కోప్పడి.. మాట్లాడకుండా ఉంటుంది. ఆ సందర్భంలోనే రాజు బాధను తెలిపేలా బుజ్జితల్లి సాడ్ వెర్షన్ పాట వస్తుంది. ఎమ...