Hyderabad, ఫిబ్రవరి 21 -- బూడిద గుమ్మడి వడియాలు ఎంతో మందికి ఇష్టం. కానీ వీటిని చేయడం చాలా కష్టమని భావించి వాటిని కొనేందుకు ఇష్టపడతారు. నిజానికి ఇంట్లోనే వీటిని హెల్తీగా, శుచిగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మేము సింపుల్ గా బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో ఇచ్చాము. ఎండాకాలం వచ్చేస్తోంది. కాబట్టి వీటిని ఎలా పెట్టాలో తెలుసుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెసిపీ తెలుసుకోండి.

బూడిద గుమ్మడికాయ - ఒకటి

మినప్పప్పు - అరకిలో

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - ఒక స్పూను

జీలకర్ర - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - 15

అల్లం - పెద్ద ముక్క

సగ్గుబియ్యం - పావు కప్పు

1. మీడియం సైజులో ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకొని సన్నగా తరగాలి.

2. అందులో ఉన్న గింజలను పడేయకుండా అలానే ఉంచాలి.

3. వాటిని ఒక ప్లేట్లో వేసి పసుపు, ఉప్పు కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి.

4....