భారతదేశం, ఫిబ్రవరి 1 -- స్టాక్​ మార్కెట్​లకు శనివారం సాధారణంగా సెలవు ఉంటుంది. కానీ బడ్జెట్​ 2025 నేపథ్యంలో దేశీయ సూచీలు నేడు ఓపెన్​లో ఉంటాయి. సాధారణ టైమింగ్స్​లానే పనిచేస్తాయి. ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 741 పాయింట్లు పెరిగి 77,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 259 పాయింట్లు వృద్ధిచెంది 23,508 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 275 పాయింట్లు పెరిగి 49,587 వద్దకు చేరింది.

"నిఫ్టీ ట్రెండ్​ బలంగా ఉంది. 23500 స్థాయిల రెసిస్టెన్స్​ని అధిగమించిన బుల్స్​ తక్కువ సమయంలోనే 23800 స్థాయిల రెసిస్టెన్స్​ దిశగా దూసుకెళుతున్నాయి. ఇన్​స్టెంట్​ సపోర్ట్​ 23400 స్థాయిలో ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు.

దేశీయ స్...