Hyderabad, ఫిబ్రవరి 1 -- కేంద్ర బడ్జెట్ ను సమర్పించేందుకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సిద్ధమయ్యారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ను సమర్పించేటప్పుడు కట్టుకునే చీర కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అది భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. ప్రతి చీర కూడా భారతదేశంలోని భిన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించే రోజు కట్టే చీరలు కూడా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

గతేడాది ఆమె ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను సమర్పించారు. ఆ సమయంలో నీలిరంగు చీరను ధరించారు. ఇది పశ్చిమబెంగాల్లో లభించే కంఠా ఎంబ్రాయిడరీని కలిగి ఉంది. ఈ చీర పై కనిపించే ఆకు డిజైన్ బెంగాల్‌కు చెందిన ప్రాచీన ఎంబ్రాయిడరీ వర్కులలో ఒకటి. బెంగాల్ నుండి ప్రత్యేకంగా ఈ నీలిరంగు చీరను తెప్పించుకొని మరి ఆమె ధరించారు. ఇది ఆక్వా కల్చర్ ఉత్...