భారతదేశం, ఏప్రిల్ 14 -- జీవితంలో ఒక ఇల్లు కొనాలని, సొంతంగా ఒక కారు కొనుక్కోవాలని మిడిల్​ క్లాస్​ ప్రజలు కలలు కంటూ ఉంటారు. కలలను నెరవేర్చేందుకు సంవత్సరాల తరబడి సేవింగ్స్​ చేస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఇండియాలో బడ్జెట్​ ఫ్రెండ్లీ వాహనాలకు కూడా డిమాండ్​ పెరుగుతోంది. ఫలితంగా ఆటోమొబైల్​ సంస్థలు కూడా ఈ సెగ్మెంట్​పై ఫోకస్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 5లక్షలు, అంతకన్నా తక్కువ ధరకు లభిస్తున్న కొన్ని కార్ల వివరాలను ఇప్పుడు మేము మీకు చెబుతాము. ధర రూ. 5లక్షలే అని తక్కువ చేసి చూసే విధంగా ఇవి అస్సలు ఉండవు! మార్కెట్​లో వీటికి మంచి సేల్స్​ ఉన్నాయి.

టాటా టియాగో- టాటా మోటార్స్​ నుంచి వచ్చిన అఫార్డిబుల్​ కార్స్​లో ఈ టాటా టియాగో ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 10ఏళ్లుగా ఇది మార్కెట్​లో ఉంది. టాటా టియాగో ప్రారంభ ధర రూ. 4.99లక్షలు. టాప్​ ఎండ్​ వేరియంట్​ రూ...