భారతదేశం, జనవరి 30 -- కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​ని ప్రతియేటా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ఆనవాయతీగా వస్తోంది. ఈసారి కూడా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్ 2026​ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి ఫిబ్రవరి 1 అనేది ఆదివారం వచ్చింది. బడ్జెట్​ అనేది దేశంతో పాటు స్టాక్​ మార్కెట్​లకు కూడా చాలా కీలకమైన విషయం. ఈ నేపథ్యంలోనే, సాధారణంగా ఆదివారం నాడు సెలవులో ఉండే స్టాక్​ మార్కెట్​లకు ఈసారి పనిచేస్తాయా? అన్న సందేహాలు ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈలు స్పందించాయి. ఫిబ్రవరి 1, ఆదివారం, బడ్జెట్ 2026​ నాడు స్టాక్​ మార్కెట్​లు పనిచేస్తాయని అధికారికంగా ప్రకటించాయి.

యూనియన్ బడ్జెట్ 2026 ఫిబ్రవరి 1, ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఎన్‌ఎస్‌ఈ సర్క్యులర్ ప్రకారం.. ఆ రోజు, మార్కెట్​లు సాధారణ సమయాల...