భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయరంగానికి సంబంధించి కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా ప్రకటించారు. ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రకటన తర్వాత వ్యవసాయరంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పైకి వెళ్లాయి. ఈ పథకం కింద తక్కువ దిగుబడులు వచ్చే 100 జిల్లాలకు వర్తింపచేయనున్నారు.

బీఎస్ఈలో కావేరీ సీడ్ షేరు 6.99 శాతం పెరిగి రూ.964.85 వద్ద, మంగళం సీడ్స్ 3 శాతం పెరిగి రూ.212 వద్ద, నాథ్ బయో జీన్స్ 5 శాతం పెరిగి రూ.174.20 వద్ద, ధనుకా అగ్రిటెక్ 2.61 శాతం పెరిగి రూ.1,479.35 వద్ద, యూపీఎల్ 0.94 శాతం పెరిగి రూ.609 వద్ద ముగిశాయి.

పారాదీప్ ఫాస్ఫేట్స్ షేరు 2.75 శాతం పెరిగి రూ.115.90 వద్ద, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 0.95 శాతం పెరిగి రూ.164.75 వద్ద, పీఐ ఇండస్ట్రీస్ 0.85 శాతం ...