భారతదేశం, ఫిబ్రవరి 1 -- నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ అనేక అంచనాల మధ్య వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల కోసం బడ్జెట్‌కు సంబంధించి ప్రత్యేక ప్రకటనలు చేశారు. వెనుకబడిన తరగతుల మహిళలకు రుణ పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు.

5 లక్షల మంది షెడ్యూల్డ్ కులాలు/తెగల మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు. దీని ద్వారా టర్మ్ లోన్ అందించనున్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు, ఇప్పటికే వ్యాపారం చేస్తూ.. పెంచుకోవాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. దీంతో వచ్చే ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కొత్త ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచ...