భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో గురజాడ్ అప్పారావు సూక్తిని ప్రస్తావించారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అనే మాటలను గుర్తు చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా.. భారత్ మెరుగైన పనితీరు కనబరించిందని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన కేటాయింపులను చదివి వినిపించారు నిర్మలా సీతారామన్. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సహం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన ఉంటుందని తెలిపారు.

కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి కీలక అప్డేట్ ఇచ్చారు కేంద్రమంత్రి. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్టుగా...