భారతదేశం, జనవరి 28 -- కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గర పడింది. చాలా రంగాల నుంచి బడ్జెట్ మీద అనేక అంచనాలు ఉన్నాయి. సామాన్యులు సైతం అనేక అంచనాలతో ఉన్నారు. అదేవిధంగా సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా కేంద్ర బడ్జెట్ నుండి కొన్ని రాయితీలను ఆశిస్తున్నారు.

జీతం పొందే పన్ను చెల్లింపుదారులను ఉపయోగపడేలా కొత్త పన్ను విధానంలో ఇచ్చే ఆదాయపు పన్ను స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 1 లక్షకు పెంచవచ్చని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.75,000 ఫిక్స్‌డ్ డిడక్షన్ ఉంది. ఇంత మెుత్తం ఆదాయంపై ఎలాంటి ప్రూఫ్ లేకుండా పన్ను తగ్గించుకోవచ్చు. ఎక్కవగా మధ్యతరగతివారు, ఉద్యోగులు దీనితో ప్రయోజనం పొందుతారు.

కొత్త పన్ను విధానంలోకి మారేందుకు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నందున పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని అంటున్న...