భారతదేశం, జనవరి 31 -- బడ్జెట్​ 2025 కోసం యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు హాట్​టాపిక్​గా మారాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలకు గుడ్​ న్యూస్​ అందే విధంగా ఈ దఫా బడ్జెట్​ని కేంద్రం రూపొందించినట్టు మోదీ సంకేతాలిచ్చారు.

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాగా సమావేశాలకు ముందు మీడియా ముందు ప్రధాని మాట్లాడారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని ప్రస్తావిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మంచి జరగాలని అభిప్రాపడ్డారు.

"మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కటాక్షం కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంగా భారత్​ 75ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా ఉంది. అంతర్జాతీయంగానూ ఇండియా బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది," అని మోదీ వ్యాఖ్యానించారు.

"నా మూడో టర్మ్​లో ఇదే తొలి పూర్తి బడ్జెట్....