భారతదేశం, జనవరి 30 -- బడ్జెట్ మీద సామాన్య ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. బడ్జెట్‌లోని ప్రకటనలు అందరినీ ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. నిత్యావసర వస్తువుల ధరల నుండి ఆదాయపు పన్ను వరకు ప్రతిదీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతారు.

నిత్యావసరాల నుండి ఆటోమొబైల్స్, గాడ్జెట్ల వరకు ప్రతిదాని ధర బడ్జెట్ మీద ఆధారపడి నడుస్తుంది. ముఖ్యంగా పన్ను సంబంధిత విషయాలలో అనేక మార్పులు ధరల హెచ్చుతగ్గులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపెడతాయి. ఈ సంవత్సరం సామాన్య ప్రజలు రోజువారీ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ పై అధిక అంచనాలను కలిగి ఉన్నారు. ముఖ్యంగా డిజిటల్ ఉత్పత్తుల ధర తగ్గే అవకాశంపై అధిక అంచనాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియాపై దృష్టి పెట్టడం వల్ల సామాన్యులు మరింత డిజిటల్...