భారతదేశం, ఫిబ్రవరి 1 -- దేశంలో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం ఉన్న గిగ్ వర్కర్లు, ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది. గిగ్ వర్కర్ల గుర్తింపు, నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుందని, ఇది వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా చెప్పారు.

ఈ కొత్త నిబంధన కింద గిగ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ వర్కర్లకు గుర్తింపు కార్డు, ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. వీటితో పాటు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(పీఎంజేఏవై) కింద వారికి ఆరోగ్య బీమా సదుపాయం కూడా లభిస్తుంది. దీని వల్ల దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

ప్రస్తుత కాలంలో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, లాజిస్టిక్స్, ఆన్...